News December 4, 2024

మహిళలను ఆర్థికంగా బలపరచండి: CM CBN

image

AP: రాష్ట్రంలోని మహిళలను స్వయం సహాయక సంఘాల(SHG) ద్వారా ఆర్థికంగా బలపరచాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. SHGలను MSMEలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కేటగిరీలుగా విభజించాలన్నారు. ఏటా రూ.లక్షకు తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ.లక్ష-రూ.10 లక్షలు ‘లాక్‌పతి’, రూ.10లక్షలు పైనుంటే ‘మైక్రో’, రూ.50లక్షల పైన ‘స్మాల్’, రూ. కోటికి ఎక్కువ ఆర్జిస్తే ‘మీడియం’ కేటగిరీలుగా విభజించాలన్నారు.

Similar News

News September 19, 2025

EXCLUSIVE: త్వరలో గ్రూప్-2 ఫైనల్ లిస్టు!

image

TG: దసరాలోగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారి లిస్టు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 783 పోస్టులకు ఈనెల 13న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విషయం తెలిసిందే. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురైన కారణంగా ముందుగా గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పండగకు ముందే తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

News September 19, 2025

ఫిరాయింపులపై CM రేవంత్ కామెంట్.. చట్టం ఏం చెబుతోంది..?

image

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్‌కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10 సమాధానాలు

image

1. శ్రీరాముడి పాదధూళితో ‘అహల్య’ శాపవిముక్తురాలైంది.
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. కృష్ణద్వైపాయనుడు అంటే ‘వేద వ్యాసుడు’.
4. మధుర మీనాక్షి దేవాలయం ‘వైగై నది’ ఒడ్డున ఉంది.
5. చిరంజీవులు ఏడుగురు. వారు 1. అశ్వత్థామ 2. బలి చక్రవర్తి 3. వ్యాస మహర్షి 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపాచార్యుడు 7. పరశురాముడు <<-se>>#mythologyquiz<<>>