News December 4, 2024

మహిళలను ఆర్థికంగా బలపరచండి: CM CBN

image

AP: రాష్ట్రంలోని మహిళలను స్వయం సహాయక సంఘాల(SHG) ద్వారా ఆర్థికంగా బలపరచాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. SHGలను MSMEలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కేటగిరీలుగా విభజించాలన్నారు. ఏటా రూ.లక్షకు తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ.లక్ష-రూ.10 లక్షలు ‘లాక్‌పతి’, రూ.10లక్షలు పైనుంటే ‘మైక్రో’, రూ.50లక్షల పైన ‘స్మాల్’, రూ. కోటికి ఎక్కువ ఆర్జిస్తే ‘మీడియం’ కేటగిరీలుగా విభజించాలన్నారు.

Similar News

News January 25, 2025

రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!

image

TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.

News January 25, 2025

టెట్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈనెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్‌లో సుమారు 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News January 25, 2025

మౌనీ అమావాస్య.. 10 కోట్ల మంది వస్తారని అంచనా!

image

ఈ నెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృతస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 కి.మీ పొడవైన ప్రత్యేక ఘాట్ సిద్ధం చేస్తోంది. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని తెలిపింది. ఫిబ్రవరి 3 (వసంత పంచమి), 12 (మాఘ పూర్ణిమ), 26 (మహా శివరాత్రి) తేదీల్లోనూ పెద్దఎత్తున అమృతస్నానాలు చేయనున్నారు.