News December 4, 2024

రాహుల్ బయటేం చేస్తున్నారు?: LS ప్యానెల్ స్పీకర్

image

యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.

Similar News

News December 27, 2024

నన్ను అల్లు అర్జున్‌తో పోల్చవద్దు: అమితాబ్

image

‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా KBCలో తాను అల్లు అర్జున్, అమితాబ్ ఫ్యాన్ అని ఓ కంటెస్టెంట్ చెప్పారు. దీనికి అల్లు అర్జున్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడని, ఈ గుర్తింపునకు అతను అర్హుడని పేర్కొన్నారు. తాను కూడా పుష్ప-2తో AAకు అభిమానిని అయ్యానని చెప్పారు. ఆయనతో తనను పోల్చవద్దని బిగ్ బీ పేర్కొన్నారు.

News December 27, 2024

GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!

image

గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.

News December 27, 2024

షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్

image

TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.