News December 4, 2024
రాహుల్ బయటేం చేస్తున్నారు?: LS ప్యానెల్ స్పీకర్
యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News January 17, 2025
Veg Mode Fee వసూలుపై జొమాటో CEO క్షమాపణలు
కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.
News January 17, 2025
స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ప్రధాని మోదీ ట్వీట్
స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద రూ.10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తోంది’ అని పేర్కొన్నారు.
News January 17, 2025
8th పే కమిషన్.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్‌లో ఫిట్‌మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.