News November 26, 2024

తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి

image

AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.

Similar News

News November 7, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

News November 7, 2025

కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

image

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.

News November 7, 2025

దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>దక్షిణ మధ్య రైల్వే<<>>లో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.