News April 6, 2024

తొలిసారి ఓటు వేయనున్న 92 ఏళ్ల వృద్ధుడు

image

ఝార్ఖండ్‌లో 92 ఏళ్ల వృద్ధుడు ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. సాహిబ్‌గంజ్ జిల్లా ముండ్రో బ్లాకు పోలింగ్ బూతులో ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు తాను ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటు వేయలేదని, తనకు ఓటు హక్కే లేదని ఎన్నికల అధికారులకు చెప్పారు. విషయం తెలుసుకున్న CEO రవికుమార్ వెంటనే అన్సారీ పేరును ఓటరు జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జూన్ 1న జరగనున్న పోలింగ్‌లో ఆయన తొలిసారి ఓటు వేయనున్నారు.

Similar News

News October 28, 2025

దూసుకొస్తున్న తుఫాను.. బయటికి రావొద్దు!

image

AP: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ‘మొంథా’ తుఫాను గడిచిన 6గంటల్లో 15Kmph వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 280km, కాకినాడకు 360km, విశాఖపట్నంకి 410km దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

News October 28, 2025

ఆర్టీసీలో 1,743 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.tgprb.in/

News October 28, 2025

చైనాలో ‘రీల్’ చేయాలంటే.. డిగ్రీ ఉండాల్సిందే!

image

డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియా రీల్స్ చేసేలా చైనా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ వంటి అంశాలపై వీడియోలు చేయాలంటే ఆయా సబ్జెక్టులపై వారు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే SM ప్లాట్‌ఫామ్స్ కూడా వారి డిగ్రీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటించని వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ.12 లక్షల వరకు ఫైన్ విధిస్తారు.