News December 8, 2024
ఒక అరటిపండు.. రైలును ఆపేసింది!

బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 4వ ప్లాట్‌ఫామ్‌పై దొరికిన అరటిపండు కోసం రెండు కోతులు కొట్టుకున్నాయి. కోపంలో ఓ కోతి మరో కోతిపైకి రబ్బరు వస్తువును విసిరింది. అది కాస్తా ఓ విద్యుత్ వైరుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి వైరు ఊడి ఆగి ఉన్న రైలు బోగీపై పడింది. దీంతో ఆ స్టేషన్‌కి రైళ్ల రాకపోకలు గంటసేపు నిలిచిపోయాయి. ఇదంతా చేసిన కోతులు చక్కగా అరటిపండుతో పరారయ్యాయి.
Similar News
News November 15, 2025
రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.
News November 15, 2025
తెలంగాణలో 26 అధునాతన గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్రంలో పంట నిల్వకు గోదాముల కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో 26 అధునాతన గోదాములు నిర్మించాలని నిర్ణయించింది. నిల్వ చేసిన పంటకు ఎలుకలు, చీడపీడల బెడద లేకుండా, గాలి, వెలుతురు అవసరం మేరకు ఉండేట్లు వీటిని నిర్మించనున్నారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు AI వినియోగించి తూకం, నిల్వ విధానాన్ని సులభతరం చేయనున్నారు.


