News February 19, 2025
భారీ బడ్జెట్‌గా చిరు-రావిపూడి మూవీ?

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే మూవీకి బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లకే రూ.100 కోట్ల పైచిలుకు అవుతోందని, చిత్రీకరణ ఖర్చును కలుపుకొని బడ్జెట్ రూ.200 కోట్లు దాటేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంచి టాక్ వస్తే ఆ మొత్తాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని పేర్కొన్నాయి. కాగా ‘విశ్వంభర’ సైతం ఇంచుమించు ఇదే బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.
Similar News
News February 21, 2025
TODAY HEADLINES

* మిర్చి రైతులను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
* ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు
* నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
* కేసీఆర్, జగన్ స్నేహం వల్లే ఏపీ జల దోపిడీ: మంత్రి ఉత్తమ్
* అక్రమ కేసులకు భయపడేది లేదు: YS జగన్
* యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC
* ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
* ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
* బంగ్లాదేశ్‌పై భారత్ సూపర్ విక్టరీ
News February 21, 2025
మహమ్మద్ షమీ ‘ది వారియర్’

మహమ్మద్ షమీ ఓటమిని ఒప్పుకోరు. గతేడాది కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితి నుంచి CT తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన వరకు తన కృషి పోరాట యోధుడికి ఏ మాత్రం తీసిపోదు. గాయంతో ఏడాదికి పైగా జట్టుకు దూరమైనా, BGTకి సెలక్ట్ కాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించకపోయినా పట్టుదల వదల్లేదు. ఏడాదిలోనే కమ్ బ్యాక్ చేసి బంగ్లాపై 5 వికెట్లు తీశారు. స్లో పిచ్‌పై రాకెట్ల లాంటి బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.
News February 21, 2025
నేను ‘కింగ్’ని.. ట్రంప్ పోస్ట్

US అధ్యక్షుడు ట్రంప్ తనకు తానే రాజుగా ప్రకటించుకున్నారు. ‘CONGESTION PRICING’ను రద్దు చేసి న్యూయార్క్ నగరాన్ని సేవ్ చేశానని చెబుతూ ‘కింగ్’గా అనౌన్స్ చేసుకున్నారు. కాసేపటికే ట్రంప్ తలపై కిరీటం ఉంచి ఎడిట్ చేసిన ఫొటోను WHITE HOUSE ట్వీట్ చేసింది. న్యూయార్క్‌లో బిజీ టైంలో భారీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లోకి ప్రవేశించే డ్రైవర్లకు 9 డాలర్లు ఛార్జ్ చేస్తారు. దీన్నే ‘CONGESTION PRICING’ అంటారు.