News February 19, 2025
భారీ బడ్జెట్‌గా చిరు-రావిపూడి మూవీ?

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే మూవీకి బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లకే రూ.100 కోట్ల పైచిలుకు అవుతోందని, చిత్రీకరణ ఖర్చును కలుపుకొని బడ్జెట్ రూ.200 కోట్లు దాటేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంచి టాక్ వస్తే ఆ మొత్తాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని పేర్కొన్నాయి. కాగా ‘విశ్వంభర’ సైతం ఇంచుమించు ఇదే బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.
Similar News
News April 17, 2026
పడిపోయిన బొప్పాయి ధరలు

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.
News April 17, 2026
వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.
News April 17, 2026
భారత్‌కు సౌత్ కొరియా అధ్యక్షుడు

సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత్ పర్యటనకు రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 19వ తేదీ ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా లీ పర్యటన సాగనుంది. మరోవైపు పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలకాంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


