News March 19, 2024
స్టార్ క్రికెటర్‌కు బిగ్ షాక్
టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగాకు ఐసీసీ షాకిచ్చింది. రీఎంట్రీ తర్వాత ఆడనున్న తొలి రెండు టెస్టులకు సస్పెండ్ చేసింది. ఈ నెల 18న బంగ్లాతో జరిగిన వన్డేలో అతడు అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డీమెరిట్ పాయింట్లతో పాటు 2 టెస్టులకు సస్పెండ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు హసరంగ దూరమయ్యారు.
Similar News
News September 19, 2024
లడ్డూ నాణ్యతపై సీఎం వ్యాఖ్యలు నిజమే: రమణ
AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు <<14134836>>వ్యాఖ్యలు<<>> నిజమేనని TTD మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ చెప్పారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతలు ఇచ్చారని మీడియాకు తెలిపారు. వైవీ, భూమన, ధర్మారెడ్డి తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
News September 19, 2024
9 ఏళ్లకే యాప్.. 13 ఏళ్లకే సొంత కంపెనీ!
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత కేరళకు చెందిన ఆధిత్యన్ రాజేశ్‌కు సరితూగుతుంది. 9 ఏళ్లకే మొదటి మొబైల్ యాప్‌ని సృష్టించాడు. 13 ఏళ్లకే సైట్స్, లోగోస్ క్రియేట్ చేసే కంపెనీ స్థాపించాడు. తోటివారు ఖాళీ సమయంలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఇతను సాఫ్ట్‌వేర్‌పై ట్రైనింగ్ తీసుకున్నాడు. తాను స్థాపించిన ట్రినెట్ సొల్యూషన్స్‌ని పాఠశాల స్నేహితుల సహాయంతో నడిపిస్తున్నాడు. అతని కంపెనీకి 12 మంది క్లయింట్స్ ఉన్నారు.
News September 19, 2024
ఆయన డాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్: ఎన్టీఆర్
తమిళ హీరో విజయ్ డాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని ఎన్టీఆర్ అన్నారు. అతి చూపించకుండా ఉండాలని, విజయ్ స్టెప్పులు కూల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయని చెప్పారు. డాన్స్ అనేది ఫైట్, జిమ్నాస్టిక్స్ చేసినట్లుగా ఉండొద్దన్నారు. శ్రమపడనట్లుగా డాన్స్ ఉండాలని విజయ్ అలాగే చేస్తారని కొనియాడారు. అప్పట్లో తామిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు. కాగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ ఈ నెల 27న విడుదల కానుంది.