News December 18, 2024

ఒకింత ఆశ్చర్యపోయా: హర్భజన్ సింగ్

image

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. అతనో గొప్ప బౌలర్, లెజెండ్ అని కొనియాడారు. ఇండియా కోసం చాలా వికెట్లు తీశారని చెప్పారు. తన గొప్ప ప్రదర్శనతో ఎన్నో‌సార్లు ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారని వివరించారు. తను ప్రారంభించబోయే కొత్త జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు హర్భజన్ తెలిపారు.

Similar News

News January 25, 2025

నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు: షర్మిల

image

AP: బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని అన్నారు. ‘జగన్‌కు విజయసాయి అత్యంత సన్నిహితుడు. ఎవరిని తిట్టమంటే వారిని తిడతాడు. అలాంటి ఆయన రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నారు. VSRను BJPలోకి పంపుతున్నారు’ అని ఆరోపించారు.

News January 25, 2025

VSR రాజీనామా వైసీపీకి నష్టమా?

image

AP: విజయసాయిరెడ్డి రాజీనామా YCPకి నష్టం కంటే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఎమోషనల్‌గా కష్టమైన విషయం. YCP ఆవిర్భావం నుంచి ఉన్న నలుగురైదుగురిలో ఒకరైన ఆయనే పార్టీని వీడటం మనో ధైర్యం కోల్పోయే విషయం. లక్షల ఓట్లను ప్రభావితం చేసే మాస్ లీడర్ కాదు కాబట్టి YCP ఓటు బ్యాంకుకు నష్టమేం లేదు. కాకపోతే YS కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్న వ్యక్తి, జగన్‌కు అన్నీ తానైన VSR పార్టీని వీడటం YCPని చాలా బాధపెట్టే విషయం.

News January 25, 2025

ICC మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్ష్‌దీప్

image

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ICC ప్రకటించింది. 25 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ బౌలర్ టీ20ల్లో భారత తరఫున అత్యధిక వికెట్లు(97) తీసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. 2024లో ఆడిన 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీశారు. గత ఏడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించారు.