News July 16, 2024

తోకతో జన్మించిన బాలుడు.. సర్జరీ చేసిన వైద్యులు

image

TG: బీబీనగర్ ఎయిమ్స్‌లో వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. గత ఏడాది ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. వయసు పెరిగే కొద్ది ఆ తోక పెరగడంతో చిన్నారి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అది వెన్నుపూసతో అనుసంధానమై బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఇటీవల బాలుడికి సర్జరీ చేసి తొలగించారు. నాడీవ్యవస్థకు అటాచ్ అవడంతో సమస్యలు ఎదురవుతాయని భావించినా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News October 14, 2024

9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర?

image

ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.

News October 14, 2024

జోష్‌లో స్టాక్ మార్కెట్లు

image

వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్‌లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.

News October 14, 2024

మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు

image

AP: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వానలు ప్రారంభమవుతాయని తెలిపారు.