News May 19, 2024
DC ప్లేయర్ ఫ్రేజర్ మెక్ గుర్క్‌కు బంపరాఫర్

టీ 20 వరల్డ్ కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన జట్టుతో కలిసి అమెరికా విమానం ఎక్కనున్నారు. తొలుత ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో ఫ్రేజర్‌కు చోటివ్వలేదు. కాగా ఫ్రేజర్ మెక్ గుర్క్ ఐపీఎల్‌లో దుమ్ములేపారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఏకంగా 235 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశారు. ఇందులో 26 సిక్సర్లు, 30 ఫోర్లు ఉన్నాయి.
Similar News
News November 20, 2025
అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్‌పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
News November 20, 2025
ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.
News November 20, 2025
తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.


