News May 19, 2024
DC ప్లేయర్ ఫ్రేజర్ మెక్ గుర్క్‌కు బంపరాఫర్
టీ 20 వరల్డ్ కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన జట్టుతో కలిసి అమెరికా విమానం ఎక్కనున్నారు. తొలుత ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో ఫ్రేజర్‌కు చోటివ్వలేదు. కాగా ఫ్రేజర్ మెక్ గుర్క్ ఐపీఎల్‌లో దుమ్ములేపారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఏకంగా 235 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశారు. ఇందులో 26 సిక్సర్లు, 30 ఫోర్లు ఉన్నాయి.
Similar News
News December 10, 2024
బాక్సింగ్ డే టెస్ట్.. ఫస్ట్ డే టికెట్లన్నీ సేల్
ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుకు ఉన్న క్రేజే వేరు. ఆ మ్యాచ్ తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఈ నెల 26న మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో మ్యాచ్ జరగనుండగా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ లక్షగా ఉంది. మ్యాచ్‌కు 15 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. కాగా మూడో టెస్టు ఈ నెల 14న గబ్బా స్టేడియంలో జరగనుంది.
News December 10, 2024
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.
News December 10, 2024
ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల
AP: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని YCP స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజల గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. సమస్యలపై సర్కార్ దిగొచ్చేవరకూ బాధితులకు అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి’ అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.