News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.
Similar News
News December 12, 2024
90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన వృద్ధురాలు
డిగ్రీ పూర్తి చేయాలనే సంకల్పం ముందు వృద్ధాప్యం చిన్నబోయింది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 90ఏళ్ల రాబర్జ్ న్యూ హాంప్‌షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తిచేసే వరకూ నిద్రపోనని ఆమె చెప్తున్నారు. ఆమె ఇదివరకు సమీపంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతో పాటు బీమా ఏజెంట్‌గా పనిచేసేవారు. ఆమెకు ఐదుగురు పిల్లలుండగా 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు.
News December 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA
AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
News December 12, 2024
ఈనెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: మంత్రి
AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.