News February 22, 2025
భర్త కట్నం అడగనప్పటికీ 498ఏ కేసు పెట్టొచ్చు: సుప్రీం కోర్టు

భర్తపై 498A చట్టం ప్రకారం కేసు పెట్టడానికి అతడు కట్నం అడిగి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘భర్త కట్నం అడిగితేనే ఆ కేసు పెట్టాలన్న రూలేం లేదు. క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది వర్తిస్తుంది’ అని పేర్కొంది. ఓ భర్త కట్నం అడగకపోయినా భార్య 498ఏ కేసు పెట్టగా అది చెల్లదని AP హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకు వెళ్లగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
Similar News
News March 23, 2025
బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.
News March 23, 2025
ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.
News March 23, 2025
మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.