News September 24, 2024

భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. లడ్డూ వివాదంపై తిరుమలలోని అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని తిరుమలకు చేరుకునే ముందు ఆయనకు పోలీసులు నోటీసులిచ్చారు. అయినప్పటికీ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

Similar News

News July 10, 2025

కష్టపడుతున్న భారత బౌలర్లు

image

భారత్‌తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్‌లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్‌కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.

News July 10, 2025

తొలి క్వార్టర్‌: TCS‌కు రూ.12,760 కోట్ల లాభం

image

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్‌(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డిక్లేర్ చేసింది.

News July 10, 2025

జనగణన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

AP: రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది.