News May 20, 2024

ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

image

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో నుంచి వైసీపీ కార్యకర్తను ఆయన బలవంతంగా తీసుకెళ్లారనేది అభియోగం. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.

Similar News

News September 19, 2025

పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.

News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.

News September 19, 2025

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.