News May 20, 2024
ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

AP: కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో నుంచి వైసీపీ కార్యకర్తను ఆయన బలవంతంగా తీసుకెళ్లారనేది అభియోగం. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదు చేశారు.
Similar News
News July 11, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు
News July 11, 2025
ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.
News July 11, 2025
భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.