News November 29, 2024

వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు

image

AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ గార్డెన్స్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేయగా రాత్రి 11 గం.కు పోలీసులు సోదాలు చేపట్టారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Similar News

News December 25, 2025

DGP ఎంపికపై కీలక ఆదేశాలు

image

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

News December 25, 2025

ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎవరికి ఉంటుందంటే..

image

40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం కూడా మొదలవుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, మృదువుగా మారడం ప్రారంభిస్తాయి. చాలామంది మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య ఈ వయసులోనే మొదలవుతుంది. సరైన జీవనశైలి లేని స్త్రీలు బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

News December 25, 2025

TDPలో పదవుల జాతర!

image

AP: TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్, SM కో-ఆర్డినేటర్లు ఉంటారని సమాచారం. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలిపి కమిటీలో 42 మందిని నియమించనున్నారు. ఈ కమిటీల్లో మహిళలకు 28% కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.