News November 29, 2024

వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు

image

AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ గార్డెన్స్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేయగా రాత్రి 11 గం.కు పోలీసులు సోదాలు చేపట్టారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Similar News

News December 6, 2024

SHOCKING: నటి ప్రైవేట్ వీడియోలు లీక్

image

సౌత్ ఇండియా నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం కలకలం రేపింది. ఆమెకు సంబంధించిన వీడియోలను దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో #pragyanagra హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందుకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హరియాణాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు.

News December 6, 2024

అల్లు అర్జున్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

image

‘పుష్ప 2’ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్‌, చిక్కడపల్లి పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది రామారావు తెలిపారు. ‘షోకు అల్లు అర్జున్ వస్తున్న విషయంపై సమాచారం లేదంటూ పోలీసులు తప్పించుకుంటున్నారు. ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణం. రేవతి కుటుంబానికి రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరాను’ అని రామారావు తెలిపారు.

News December 6, 2024

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి

image

TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల TGPSC ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.