News November 30, 2024

నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. FIR నమోదు

image

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు శరద్ కపూర్‌పై FIR నమోదైంది. ఓ ప్రాజెక్ట్‌ విషయమై ఈనెల 26న ఆయన తనను ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని 32 ఏళ్ల మహిళ ముంబైలోని ఖర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శరద్ కపూర్‌పై BNS 4, 75, 79 సెక్షన్ల కింద FIR నమోదు చేసి, విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కాగా శరద్ కపూర్ జోష్, కార్గిల్ LOC, లక్ష్య తదితర చిత్రాల్లో నటించారు.

Similar News

News July 7, 2025

గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

image

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్‌ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.

News July 7, 2025

రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

image

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.