News April 24, 2024
శతాధిక వృద్ధురాలు.. అయినా ఓటుకోసం బూత్‌కు!

ముంబైకు చెందిన కాంచన్‌బెన్ బాద్షా వయసు 112 ఏళ్లు. సుఖంగా ఇంటి నుంచే నీడపట్టున ఉండి ఓటేసే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని తిరస్కరించారామె. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను స్వయంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. బెన్ సంకల్పానికి ముగ్ధులైన ఎన్నికల సంఘం స్థానిక అధికారులు ఆమెను సత్కరించారు. 1912లో పుట్టిన బెన్, ప్రస్తుతం తన మనుమల వద్ద ఉంటున్నారు.
Similar News
News February 8, 2026
వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారట.
News February 8, 2026
BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

<
News February 8, 2026
దేవుడు ఒక్కడేనా?

దైవం ఒక్కడే. కానీ ఆయన రూపాలు, నామాలు వేరు. మన స్వార్థం కోసం లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఒక దైవాన్ని పూజిస్తూ, మరో దైవాన్ని కించపరచడం మహా దోషం. భూమి సారవంతమైతే ఏ విత్తనమైనా మొలకెత్తినట్లే, మన హృదయం పవిత్రంగా ఉంటే ఏ నామంతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. విలువలతో కూడిన జీవితం, పరోపకార భావన, సంపూర్ణ విశ్వాసమే దైవకృపకు అసలైన మార్గాలని పండితులు ప్రబోధిస్తున్నారు.


