News October 16, 2024
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
రబీ సీజన్ త్వరలో ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఆరు పంటలకు MSPని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమల ధరను రూ. 2275 నుంచి రూ. 2425, బార్లీ ధర రూ. 1850 నుంచి రూ.1980, పప్పు రూ.6425 నుంచి రూ.6700, ఆవాలు – రూ. 5650 నుంచి రూ.5950, శనగ రూ. 5440 నుంచి రూ. 5650, కుసుమలు రూ.5800 నుంచి రూ.5940కు పెంచింది.
Similar News
News November 6, 2024
ఇదీ ట్రంప్ ప్రస్థానం!
1959: 13 ఏళ్ల వయసులో న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరిక
1964-68: పెన్సిల్‌వేనియా వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో BSc
1968: తండ్రికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో కొలువు
1991-2009: ఆరు ఆస్తులు దివాళా తీసినట్లు ప్రకటన
2016: అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నిక
2023: జైల్లో ఫొటో తీయించుకున్న తొలి అధ్యక్షుడిగా మచ్చ
2024: రెండు హత్యాయత్నాలు-తప్పిన ప్రమాదం, 47వ అధ్యక్షుడిగా ఎన్నిక
News November 6, 2024
BGT: రోహిత్ దూరమైతే జైస్వాల్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరంటే?
ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో BGT ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఫస్ట్ మ్యాచుకు దూరమైతే యశస్వి జైస్వాల్‌తో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ అదే నిజమైతే వీరిద్దరిలో ఎవరు ఓపెనింగ్‌కి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి?
News November 6, 2024
KTR ఆరోపణలపై స్పందించిన జలమండలి
TG: సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని KTR చేసిన ఆరోపణలపై వాటర్ బోర్డు స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. సుంకిశాల గోడ కూలడంపై విచారణకు కమిటీ వేశామని తెలిపింది. అటు నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించింది. విచారణ తర్వాత చర్యలుంటాయంది.