News August 14, 2024

‘ధరణి’లో ఆపరేటర్లుగా వారికి ఛాన్స్?

image

TG: ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన వారిని పోటీ పరీక్షల ద్వారా నియమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రస్తుతం పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా? వద్దా? అనేది త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

Similar News

News September 14, 2024

విషాదం: టీ పౌడర్ అనుకొని..

image

AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News September 14, 2024

కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్

image

హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.

News September 14, 2024

‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.