News August 16, 2024

సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి: కేటీఆర్

image

TG: రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో రైతులను మోసం చేసినందుకు రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. CM మాటలు చూస్తే మానసిక పరిస్థితి మీద అనుమానం కలుగుతోందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా కుటుంబ సభ్యులు ఆయన్ను సరిగ్గా చూసుకోవాలని కోరారు. రేవంత్ కుటుంబ పాలన బ్రహ్మాండంగా సాగుతోందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు.

Similar News

News September 10, 2024

దులీప్ ట్రోఫీ జట్లలో మార్పులు

image

దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో రెండో రౌండ్ కోసం ఇండియా-C మినహా మిగతా 3 జట్లలో బీసీసీఐ మార్పులు చేసింది. ఇండియా-A కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్‌ను నియమించింది. జైస్వాల్, పంత్ స్థానంలో ఇండియా-Bకి రింకూ సింగ్, ప్రభుదేశాయ్‌ను, అక్షర్ పటేల్ స్థానంలో ఇండియా-Dకి నిషాంత్ సింధును సెలక్ట్ చేసింది. జట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 10, 2024

LPGతో వంట ఖర్చు 5 రూపాయలే: కేంద్ర మంత్రి

image

పీఎం ఉజ్వల స్కీమ్‌లో ప్రతిరోజూ వంటకయ్యే ఖర్చు రూ.5 అని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. ఆ స్కీమ్‌లో లేనివాళ్లకు రూ.12 అవుతుందన్నారు. ‘గతంలో గ్రామాల్లో స్వచ్ఛ వంట ఇంధనం పరిమితంగా లభించేది. 2014లో 14 కోట్లున్న LPG కనెక్షన్లు 2024కు 33 కోట్లకు పెరిగాయి. సిలిండర్ ధరలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. నన్నడిగితే వారి హయాంలో అసలు సిలిండర్లే లేవంటాను’ అని పేర్కొన్నారు.

News September 10, 2024

లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం: లోకేశ్

image

AP: ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని ప‌న్నిన కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది’ అని ట్వీట్ చేశారు.