News November 7, 2024

స్వచ్ఛమైన గాలి దొరికే పట్టణాలివే

image

తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.

Similar News

News November 7, 2024

విరాట్ 2027 వరకు ఆడతారు: జ్యోతిషుడు

image

గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతుండటంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారికి ఆందోళన అవసరం లేదని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పారు. ‘విరాట్ గురించి ఆయన ఫ్యాన్స్ నన్ను తరచూ అడుగుతుంటారు. ఆయన కనీసం 2027 వరకు ఆడతారు. కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించే సమయం రానుంది. సచిన్‌ రికార్డుల్ని దాటలేకపోవచ్చు కానీ గవాస్కర్, ద్రవిడ్‌ను దాటుతారు’ అని అంచనా వేశారు.

News November 7, 2024

గోవాకు విదేశీయుల తాకిడి త‌గ్గుతోంది!

image

విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ త‌రువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 ల‌క్ష‌ల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 ల‌క్ష‌లకు తగ్గింది. ఇది 60 శాతం త‌గ్గుద‌ల‌ను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వ‌ల్ల కొంద‌రు విదేశీయులు దోపిడీకి గుర‌య్యామ‌ని భావించడం, ఇత‌ర‌త్రా అసౌక‌ర్యాల వ‌ల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.

News November 7, 2024

పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP

image

AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.