News April 11, 2024

టీడీపీలో చేరిన జగన్ సన్నిహితుడు

image

AP: సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. మంగళగిరి సమీపంలోని కురగల్లు గ్రామానికి చెందిన ఆయన.. జగన్‌కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖ వరకు 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ విధానాలతో విభేదించిన ఆయన.. ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Similar News

News March 25, 2025

పవన్ కళ్యాణ్‌కు ఆ పేరు పెట్టింది నేనే: హుస్సేని

image

లుకేమియా కారణంగా <<15878066>>చనిపోయిన<<>> కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు.

News March 25, 2025

న్యూజిలాండ్‌లో భూకంపం

image

న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 7.13 గంటలకు పశ్చిమ తీరంలోని సౌత్ ఐలాండ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది.

News March 25, 2025

ALERT: వడగాలులు.. వర్షాలు!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.

error: Content is protected !!