News May 26, 2024

రాష్ట్రంలో 615 మందికి ఒక కానిస్టేబుల్!

image

తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీస్ ఉన్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) వెల్లడించింది. వాస్తవానికి లక్ష మంది పౌరులకు 226 మంది పోలీసులు (అంటే 442 మందికి ఒకరు) ఉండాలి. కానీ లక్ష మంది పౌరులకు 163 మంది పోలీసులు ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై BPRD నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News January 15, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

image

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.

News January 15, 2026

₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

image

ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.

News January 15, 2026

కమ్యునికేషన్ లేకపోవడమే గొడవలకు కారణం

image

ఏం మాట్లాడినా గొడవలవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి వారి కమ్యునికేషన్ పాటర్న్ కారణమంటున్నారు మానసిక నిపుణులు. ఒకరు ఫీలింగ్స్ గురించి మాట్లాడితే, మరొకరు లాజికల్‌గా మాట్లాడతారు. ఒకరు ప్రజెంట్ గురించి, మరొకరు పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి దేని గురించి డిస్కస్ చేస్తున్నారో ఇద్దరికీ క్లారిటీ ఉండటం ముఖ్యమంటున్నారు. అప్పుడే బంధంలో అపార్థాలకు తావుండదని సూచిస్తున్నారు.