News May 26, 2024
రాష్ట్రంలో 615 మందికి ఒక కానిస్టేబుల్!

తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీస్ ఉన్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (BPRD) వెల్లడించింది. వాస్తవానికి లక్ష మంది పౌరులకు 226 మంది పోలీసులు (అంటే 442 మందికి ఒకరు) ఉండాలి. కానీ లక్ష మంది పౌరులకు 163 మంది పోలీసులు ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై BPRD నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.
News March 5, 2026
జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.
News March 5, 2026
హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.


