News October 13, 2024

ఇరాన్ అణు స్థావరాలపై సైబర్ అటాక్?

image

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. తమ విలువైన డాటా చోరీకి గురైనట్లు ఇరాన్ కూడా వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Similar News

News November 11, 2024

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

image

AP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.

News November 11, 2024

శివుడంటే ఎవరు? శివమంటే ఏంటి?

image

సర్వాంతర్యామి తత్వానికి ప్రతీక శివుడు. అందుకే ఆ మహాదేవుడు లింగ రూపంలో మనకోసం ఉద్భవించాడు. లింగానికి ఏది ముందు, ఏది వెనక వైపు అనేది లేదు. నువ్వే దిక్కని మనం ఏ దిక్కు నుంచి కొలిచినా ఆయన అపార కరుణామృతాన్ని మనపై వర్షిస్తాడు. దైవ రూపంలో మొదటిది లింగం. అది బ్రహ్మాండము, పూర్ణముకు చిహ్నం. అందులేనిది లేదు. అన్నీ ఆ అండము నుంచే ఏర్పడ్డాయి. శివమనగా సర్వశుభకరమని, శివుడనగా సర్వ శుభాలను చేకూర్చువాడని అర్థం.

News November 11, 2024

ఆటంతా IPLలోనే.. అభిషేక్‌పై విమర్శలు

image

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపరిచారు. దీంతో ఆయన ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ కేవలం IPLలోనే ఆడుతారని దుయ్యబడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే‌పై సెంచరీ మినహా ఆయన పెద్దగా రాణించింది లేదని, రుతురాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. కాగా గత సీజన్‌లో సత్తా చాటిన అభిషేక్‌ను SRH రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.