News March 20, 2024

తండ్రిని మోసం చేసిన కూతురు

image

రాజస్థాన్‌లో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు చెమటలు పట్టించింది. శివ్‌పురికి చెందిన కావ్య స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రామాకు తెరతీసింది. చేతులకు కట్లు వేయించుకుని తండ్రికి ఫొటోలు పంపి బెదిరించింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి సింధియా సైతం ఆ యువతిని త్వరగా కాపాడాలని పోలీసులను ఆదేశించారు. చివరకు నాటకం బయటపడింది.

Similar News

News September 19, 2024

ఇలా చేస్తున్నారా..? పళ్లు అరిగిపోతాయి!

image

తెల్లటి పలువరస కోసం చాలామంది ఎక్కువ సేపు బ్రష్ చేసుకుంటుంటారు. మరి కొంతమంది బలంగా తోముతారు. ఇవేవీ మంచివి కావంటున్నారు వైద్య నిపుణులు. ఇలా బ్రష్ చేస్తే పంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. పళ్లు సెన్సిటివ్‌గా మారి జివ్వుమని లాగుతుంటాయి. అందుకే కేవలం 2, 3 నిమిషాల్లోనే బ్రషింగ్ ముగించాలని వైద్యులు చెబుతున్నారు. ఇక నిద్ర లేచాక, నిద్రపోయే ముందు బ్రష్ చేస్తే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు.

News September 19, 2024

టెట్ అభ్యర్థులకు ALERT

image

AP: టెట్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో నమూనా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. https://cse.ap.gov.in/లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల OCT 3 నుంచి జరిగే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాసే వీలుంటుంది. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి TETకు 4.27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

News September 19, 2024

చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్ విసిరిన వైసీపీ

image

AP: శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై YCP ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో తన కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమని, CBN సిద్ధమా? అని TTD మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన <<14135822>>పోస్టును<<>> రీట్వీట్ చేసింది. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చింది. CM ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.