News August 6, 2024

సెప్టెంబర్‌లో నందమూరి ఫ్యాన్స్‌కు పండగే!

image

వచ్చే నెలలో నందమూరి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ జూబ్లీ వేడుకలు, 6న నందమూరి మోక్షజ్ఞ తేజ బర్త్ డే వేడుకలు, అలాగే 27న ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదల కానుంది. దీంతో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడు స్పెషల్ ఈవెంట్స్ ఉండటంతో సందడి నెలకొననుంది. ఆ నెల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 12, 2024

విజయ్‌ వాయిస్ ఓవర్ ప్రత్యేకం: రష్మిక

image

తాను నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చివరి వరకు తనకు తెలియదని హీరోయిన్ రష్మిక తెలిపారు. కానీ తనకు అది ప్రత్యేకమని ఆమె చెప్పారు. ‘నాకు హీరోలందరితోనూ స్నేహం ఉంది. సల్మాన్ సెట్‌లో ఉంటే షూటింగ్ సరదాగా సాగుతుంది. ఓసారి నేను సెట్‌లో అనారోగ్యానికి గురైతే మంచి ఫుడ్ తెప్పించారు. ఆయన నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దళపతి విజయ్ అంటే కూడా ఎంతో ఇష్టం’ అని ఆమె పేర్కొన్నారు.

News December 12, 2024

Mobikwik IPO: 10X స్పందన.. ఎందుకీ క్రేజ్

image

మొబీక్విక్ IPO అదరగొడుతోంది. రెండోరోజు 12PMకే 10X స్పందన లభించింది. ఇష్యూ ధర రూ.279తో పోలిస్తే GMP 53% ఎక్కువగా ఉంది. ఇన్‌స్టిట్యూషనల్స్ ఎక్కువగా ఎగబడుతున్నారు. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, రేటింగ్ సంస్థల రేటింగ్స్, 161 మిలియన్ల యూజర్ బేస్, డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంటు, దేశంలోని 99% పిన్‌కోడ్స్ పరిధిలో సేవలందిస్తుండటం ప్లస్‌పాయింట్స్. DEC 18న షేర్లు NSE, BSEలో లిస్ట్ అవ్వనున్నాయి.

News December 12, 2024

వారికీ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.