News July 25, 2024
మదనపల్లె అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు

AP: మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్నిప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే DGP నేరుగా వెళ్లి విచారణ చేశారు. తాజాగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా సమీక్ష చేపట్టారు. రికార్డుల దహనంపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు, RDOలు, తహశీల్దార్లతో మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆయన భేటీ అయ్యారు. రికార్డుల భద్రతపై ఆరా తీశారు. రెవెన్యూ ఆఫీసుల వద్ద కాపలా పెట్టాలని ఆదేశించారు.
Similar News
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 4, 2025
పంట నుంచి పత్తి తీసేటప్పుడు ఈ తప్పులు వద్దు

కొన్నిసార్లు కొన్ని పత్తి కాయలు పగిలి, మరికొన్ని పగలకుండా ఉంటాయి. అప్పుడు వాటిని కోసేందుకు రైతులు 2,3 రోజులు ఆగుతారు. అయితే అకాల వర్షాలు, మంచు వల్ల అప్పటికే పగిలిన పత్తి కూడా రంగు మారి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. అందుకే పగిలిన కాయల నుంచి పత్తిని వెంటనే తీసేయాలి. పూర్తిగా పగలని కాయల నుంచి పత్తిని తీస్తే అది ముడిపత్తిలాగా ఉండి, నాణ్యమైన పత్తితో కలిపి మార్కెట్ చేసినపుడు ధర కోల్పోయే ప్రమాదం ఉంది.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. వీరిపై ప్రభావం ఎక్కువ

AP: స్క్రబ్ టైఫస్ పురుగు చెట్లు, వ్యవసాయ భూములు పక్కనే నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పురుగు రాత్రి వేళల్లో మనుషులను కుడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తడి నేలలు, పొలం పనులకు వెళ్లేవారు రబ్బరు బూట్లు ధరించాలని, పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని చెబుతున్నారు.


