News July 25, 2024

మదనపల్లె అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు

image

AP: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే DGP నేరుగా వెళ్లి విచారణ చేశారు. తాజాగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా సమీక్ష చేపట్టారు. రికార్డుల దహనంపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు, RDOలు, తహశీల్దార్లతో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఆయన భేటీ అయ్యారు. రికార్డుల భద్రతపై ఆరా తీశారు. రెవెన్యూ ఆఫీసుల వద్ద కాపలా పెట్టాలని ఆదేశించారు.

Similar News

News October 6, 2024

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే

image

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.

News October 6, 2024

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

News October 6, 2024

డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.