News September 12, 2024
పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN
AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 3, 2024
పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన
AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
News October 3, 2024
ప్రజా ప్రతినిధులు హుందాతనాన్ని కాపాడుకోవాలి: రాజమౌళి
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్శకధీరుడు రాజమౌళి ఖండించారు. నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదన్నారు. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు హద్దులను గౌరవిస్తూ, హుందాతనాన్ని కాపాడుకోవాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని వంటి స్టార్లు సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
News October 3, 2024
అంబానీ ఇంటికి రూ.వెయ్యి కోట్ల విమానం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్టు తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. ఈ విమానం 838kmph వేగంతో నాన్ స్టాప్‌గా 11,770kmలు ప్రయాణిస్తుంది.