News September 6, 2024

శేషాచలం అడవుల్లో బంగారు బల్లి ప్రత్యక్షం

image

AP: తిరుపతిలోని శేషాచలం అడవుల్లో బంగారు బల్లి(గోల్డెన్ గెకో)ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు గుర్తించి ఫొటోలు తీశారు. అరుదైన జాతికి చెందిన ఈ జీవులు చీకటి ప్రదేశాలు, రాతి బండల్లో మాత్రమే నివసిస్తాయి. ఇవి ఒకేసారి 40-150 గుడ్లను పెట్టగలవు. ఇటీవల కాలంలో ఈ బల్లులు అంతరించే దశకు చేరుకున్నాయి. గత ఏడాది పాపికొండల అభయారణ్యం, కళ్యాణిడ్యాం పరిధిలో వీటిని గుర్తించారు.

Similar News

News September 7, 2024

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వచ్చేసింది

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్‌ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.

News September 7, 2024

BREAKING: మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం.. ఆరుగురి మృతి

image

మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్‌సిప్పి, రషీద్‌పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 7, 2024

ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 4, 4

image

దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-B బ్యాటర్ సర్ఫ‌రాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.