News August 6, 2024

ప్రకృతి వనంలో చూడ ‘పచ్చని’ ప్రయాణం

image

✤✤దేశంలోనే మోస్ట్ గ్రీనెస్ట్ రైల్వే మార్గాలివే..
✿సకలేష్పూర్ – సుబ్రమణ్య రైల్వే రూట్, కర్ణాటక
✿లాండా – మడగావ్ రైలు మార్గం(గోవా) ✿నేరల్-మాథెరన్ రైలు మార్గం(MH) ✿డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ✿నీలగిరి మౌంటైన్ రైల్వే(యునెస్కో)
రాయగడ- కోరాపుట్ (ఒడిశా) ✿హిమాలయన్ క్వీన్ (కల్కా-సిమ్లా) ✿విశాఖపట్నం – అరకులోయ ✿షోర్నూర్ – నిలంబూర్ రోడ్, కేరళ ✿కొంకణ్ రైల్వే మార్గం(MH- గోవా-KT)

Similar News

News September 9, 2024

బాహుబలి-2, పఠాన్ రికార్డులు బ్రేక్ చేసిన ‘స్త్రీ-2’

image

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ సినిమా జోరు కొనసాగుతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. రూ.584 కోట్లతో జవాన్ అగ్రస్థానంలో ఉండగా, స్త్రీ-2(రూ.551 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. త్వరలోనే నంబర్-1కు చేరే అవకాశం ఉంది. 3, 4, 5 స్థానాల్లో గదర్-2(రూ.527 కోట్లు), పఠాన్(రూ.524 కోట్లు), బాహుబలి-2(రూ.511 కోట్లు) ఉన్నాయి.

News September 9, 2024

వాళ్ల ఫస్ట్ టార్గెట్ బీజేపీ ఆఫీస్: NIA

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజే బెంగళూరులోని BJP ఆఫీసుపై నిందితులు ఐఈడీ దాడికి విఫలయత్నం చేశారని పేర్కొంది. తొలి టార్గెట్ మిస్ అవడంతో ఆ తర్వాత రామేశ్వరం కేఫ్ పేలుడికి ప్లాన్ చేశారంది. ఈ కేసులో నలుగుర్ని నిందితులుగా పేర్కొన్న NIA, అందులో ఇద్దరు ఐసిస్ రాడికల్స్ అని తెలిపింది.

News September 9, 2024

గ్రీన్ ఫార్మా సిటీ ప్రక్రియపై సీఎం రేవంత్ సమీక్ష

image

HYD శివారులోని ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలని చెప్పారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని సమీక్షలో దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే సంప్రదింపులు జరపాలని సూచించారు.