News July 9, 2024
పెరిగిపోతున్న ‘రోస్టింగ్’ కల్చర్
సోషల్ మీడియాలో ఈ మధ్య రోస్టింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎవరైనా పాపులారిటీ సాధిస్తుంటే వారిలోని శారీరక లోపాలను ఎత్తి చూపుతూ, బూతులతో టార్గెట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా అసభ్యకర కామెంట్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. కాగా రోస్టింగ్ కోసం కొందరు ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేస్తున్నారు. వీటికి కొందరు అమాయకులు సైతం బలైపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News October 7, 2024
ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.
News October 7, 2024
దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!
పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.