News August 31, 2024
వణికించిన విషాదంలో కదిలించే ప్రేమ కథ
వయనాడ్‌ను వణికించిన విపత్తులో ఓ ప్రేమ కథ అందరినీ కదిలిస్తోంది. 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్న శ్రుతి, జాన్సన్ పెద్దల ఆమోదంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అనుకోని వరదలు వీరి లైఫ్‌లో విషాదం నింపాయి. శ్రుతి 9మంది కుటుంబీకులను కోల్పోయింది. దీంతో జాన్సన్ ఉద్యోగం వదిలి ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల వెలికితీత, అంత్యక్రియల వరకు ఆమె వెంటే ఉన్నాడు. తాజాగా మృతులకు నివాళులర్పించిన వారు, SEPలో పెళ్లి చేసుకోనున్నారు.
Similar News
News September 19, 2024
సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.
News September 19, 2024
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.
News September 19, 2024
మోదీనే నం.1
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిచూపుతారు. ఈ ఏడాది Xలో జనవరి – ఆగస్టు వరకు అత్యధిక మంది మాట్లాడుకున్న వ్యక్తిగా మోదీ నిలిచారు. ఆయన తర్వాత విరాట్ కోహ్లీ(2), రోహిత్ (3), విజయ్ (4), యోగీ ఆధిత్యనాథ్ (5), రాహుల్ గాంధీ (6), ధోనీ (7), షారుఖ్ ఖాన్(8), పవన్ కళ్యాణ్ (9), ఎన్టీఆర్ (10) ఉన్నారు.