News November 18, 2024

లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ

image

AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Similar News

News November 18, 2024

గతంలో నేను జాయింట్ థెరపీ తీసుకున్నా: ఆమిర్ ఖాన్

image

తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కూతురు ఐరాతో కలిసి జాయింట్ థెరపీ తీసుకున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చెప్పారు. మానసిక సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. గతంలో ఐరా డిప్రెషన్‌తో బాధపడిందని, దాంతో తాను కూడా లోన్లీగా ఫీలయ్యానన్నారు. డా.వివేక్ మూర్తితో చర్చించి థెరపీ తీసుకోవడం తమకు ఎంతో సహకరించినట్లు చెప్పారు. మనం చేయలేని పనులకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.

News November 18, 2024

ఆ స్టాక్‌లో 20% ప‌త‌నం

image

Mamaearth పేరెంట్ కంపెనీ Honasa Consumer షేరు ధ‌ర సోమ‌వారం 20% వ‌ర‌కు ప‌త‌న‌మైంది. Q2 ఫ‌లితాలు ఆశించిన దాని కంటే బ‌ల‌హీనంగా ఉండ‌డంతో ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల‌కు దిగారు. దీంతో స్టాకు ధ‌ర లోయ‌ర్ స‌ర్క్యూట్‌ను తాకి రూ.297 వ‌ద్ద ట్ర‌ేడ్ అవుతోంది. కొన్ని ఏజెన్సీలు సంస్థ‌కు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ ఇచ్చాయి. Emkay Global ఏజెన్సీ Sell రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹600 నుంచి ₹300కు త‌గ్గించింది.

News November 18, 2024

మణిపుర్ కేసులు స్వీకరించిన NIA

image

మణిపుర్‌లో హింసకు కారణమైన మూడు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను NIA స్వీకరించింది. జిరిబమ్‌లో CRPF, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు, ఒకే కుటుంబంలోని ఆరుగురిని కిడ్నాప్ చేయడం, వారిని చంపేసిన కేసులను రాష్ట్ర పోలీసులు ఆ సంస్థకు బదిలీ చేశారు. మణిపుర్‌లో హింసకు దారితీసిన పరిస్థితులు, శాంతి భద్రతల ప్రభావంపై NIA దర్యాప్తు చేయనుంది. పరిస్థితుల నియంత్రణకు కేంద్రం మరో 2వేల CAPF అధికారులను మోహరిస్తోంది.