News August 31, 2024

22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్‌

image

రష్యాలోని కమ్‌చట్కా ద్వీపంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 హెలికాప్టర్ అదృశ్యమైంది. ఇందులో 19 ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. యాత్రికులు వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శనలో ఉండగా ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విషయాన్ని ఫెడరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్‌తో సంబంధాలు క‌ట్ అయిన ప్రాంతంలో వ‌ర్షం, మంచు కురుస్తున్న‌ట్టు తెలిపింది. గాలింపు చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

Similar News

News September 19, 2024

విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన

image

TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్‌కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.

News September 19, 2024

లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

image

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.

News September 19, 2024

గూఢచార సంస్థ మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

హెజ్బొల్లా పేజ‌ర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కి ఘ‌న చ‌రిత్రే ఉంది. 1976లో ఉగాండాలో 102 మంది బందీల విడుద‌లకు ఆప‌రేష‌న్ ఎంటెబ్బా చేపట్టింది. త‌మ అథ్లెట్ల‌ను హ‌త్య చేసిన వారిని వివిధ దేశాల్లో వెంటాడి చంపింది. ఐచ్మాన్, ఒపేరా, మొసెస్‌, డైమండ్‌, ప్లంబ‌ట్‌, స‌బేనా వంటి అనేక ఆపరేషన్లు చేపట్టింది. శత్రు దుర్భేద్యమైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మొస్సాద్ బలం.