News March 31, 2024
కొడుకు పేరును టాటూ వేయించుకున్న హీరో

‘12TH ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కొడుకు పేరు వర్దాన్, పుట్టిన తేదీ 7-2-2024ను చేతిపై టాటూ వేయించుకున్నారు. ‘అడిషన్ ఆర్ అడిక్షన్?.. రెండింటినీ నేను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు. కాగా విక్రాంత్ తన ప్రేయసి శీతల్ ఠాకూర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నారు.
Similar News
News April 19, 2025
నేటి నుంచి 10 రోజులు..

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News April 19, 2025
విజయసాయికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

AP: వైసీపీ కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా? మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే’ అని స్పష్టం చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు.
News April 19, 2025
10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.