News April 4, 2024
వాటర్ స్కూటర్‌పై హిట్‌మ్యాన్

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ తర్వాత వారం రోజుల గ్యాప్ రావడంతో ఆ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా అతడు వాటర్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Similar News
News January 2, 2026
చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.
News January 2, 2026
నేటి సామెత: కంచె వేసినదే కమతము

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 2, 2026
సరస్వతి దేవి వీణానాదం – మనసుకు అమృతం

చదువుల తల్లి సరస్వతీ దేవి చేతిలో వీణ ఉంటుంది. అందులో నుంచి వచ్చే సప్తస్వరాల తరంగాలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయి. రోజూ శాస్త్రీయ సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా మారి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ నాదం విద్యార్థులకు, మేధావులకు ఎంతో మేలు చేస్తుంది. దైవత్వం అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన జీవనశైలిని మెరుగుపరిచే ఒక గొప్ప విజ్ఞానం కూడా!


