News April 4, 2024

వాటర్ స్కూటర్‌పై హిట్‌మ్యాన్

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌ తర్వాత వారం రోజుల గ్యాప్ రావడంతో ఆ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా అతడు వాటర్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Similar News

News December 8, 2024

ప్రపంచ ధ్యాన దినోత్సవంగా DEC 21

image

ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ వెల్లడించారు. భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో దేశాల బృందం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలిపారు. ‘సర్వజన శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవంగా జరుపుకునేందుకు భారత్ మార్గనిర్దేశం చేసింది’ అని పేర్కొన్నారు.

News December 8, 2024

నాగార్జున‌సాగర్ నుంచి APకి 12TMC నీరు

image

నాగార్జున‌సాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.

News December 8, 2024

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్

image

అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.