News September 14, 2024

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు

image

TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది.

Similar News

News October 12, 2024

‘డిగ్రీ’లో అడ్మిషన్లు అంతంతమాత్రమే

image

TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.

News October 12, 2024

ఢిల్లీకి పంత్ గుడ్ బై? ట్వీట్ వైరల్

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్‌ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.

News October 12, 2024

వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతాం: భట్టి

image

TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.