News March 22, 2024

ఆ బీచ్‌లో రాళ్లు ఎత్తుకెళ్తే భారీ ఫైన్!

image

స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా‌లను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.

Similar News

News October 2, 2024

మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూ సేకరణ చేపట్టాలి: మంత్రి

image

TG: స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల SHGలను 75 లక్షలకు పెంచాలని సూచించారు.

News October 2, 2024

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!

image

గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.

News October 2, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్.. కారణాలివే!

image

చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.