News March 22, 2024

ఆ బీచ్‌లో రాళ్లు ఎత్తుకెళ్తే భారీ ఫైన్!

image

స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా‌లను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.

Similar News

News September 13, 2024

ఒంగోలు వైసీపీ నేతలతో బాలినేని భేటీ

image

AP: ఒంగోలు వైసీపీ నేతలతో మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో భవిష్యత్తు కార్యాచరణపై వారితో సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో 20 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాలినేని వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. కాగా వైసీపీ అధిష్ఠానం సూచనతో పార్టీ నేతలు సతీశ్ రెడ్డి, విడదల రజినీ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

News September 13, 2024

నిబంధనలు పెట్టకుండా నిధులివ్వండి: రేవంత్

image

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్‌లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

News September 13, 2024

టీసీఎస్‌లో వేల మంది ఉద్యోగులకు ఐటీ తాఖీదులు

image

టీసీఎస్‌లో పని చేస్తున్న 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాలని, రిఫండ్లు సైతం ఆపేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతో TDS వివరాలు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని, వేచి ఉండాలని ఉద్యోగులకు TCS సమాచారం అందించింది.