News May 19, 2024
SRH ముందు భారీ టార్గెట్
పంజాబ్ బ్యాటర్లు అదరగొట్టారు. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ముందు 215 పరుగుల టార్గెట్‌ను ఉంచారు. పంజాబ్‌కు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 71, అథర్వ తైడే 46 రన్స్‌తో అదిరే ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత రోసో 24 బంతుల్లో 49 పరుగులతో రెచ్చిపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ వికెట్ల వెనకాల అద్భుత క్యాచ్‌తో మెరిశారు.
Similar News
News December 2, 2024
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గి రూ.70,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో రూ.77,350 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.500 తగ్గి రూ.99,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 2, 2024
‘కన్నప్ప’లో మంచు విష్ణు కూతుళ్లు
‘కన్నప్ప’ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు సినీ అరంగేట్రం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అరియానా- వివియానాలు ఢమరుకంతో నాట్యం చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవనుంది.
News December 2, 2024
ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలిస్తోంది: CM రేవంత్
TG: పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోందని CM రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ ఇందిరమ్మ పాలన అని ‘X’లో పోస్ట్ చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని, ఇది హర్షణీయం అని పేర్కొన్నారు. అటు, సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించనున్న CM కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.