News March 23, 2024
భార్యకు శిరోముండనం చేసిన భర్త
AP: విశాఖలో అమానుష ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెకు శిరోముండనం చేశాడో భర్త. అనకాపల్లి PSలో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా భార్య మహాలక్ష్మి రూ.2.5లక్షల అప్పు చేసింది. డబ్బిచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో ఆ డబ్బు ఏ ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. గుండు గీసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News September 10, 2024
తోడేళ్ల దాడులకు ఆ వైరసే కారణం?
UP బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. వాటికి రేబిస్ లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడమే ఇలాంటి అసాధారణ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవి మనుషులపై భయాన్ని కోల్పోతాయని, విచ్చలవిడిగా కరుస్తాయని పేర్కొంటున్నారు. జంతు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారానే కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చీఫ్ SP యాదవ్ తెలిపారు.
News September 10, 2024
హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్
AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News September 10, 2024
ఆ ఉద్యోగాల భర్తీపై ప్రచారం ఫేక్.. నమ్మొద్దు: సమగ్రశిక్ష
AP: డిగ్రీ అర్హతతో పలు ప్రభుత్వ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్ర శిక్ష అధికారులు ఖండించారు. ‘సెంట్రల్, స్టేట్ స్కూల్స్, గురుకులాలు, ఇంటర్ బోర్డులో ఉద్యోగాలు అంటూ వార్తలు వస్తున్నాయి. DIKSHA&UNICEF కౌన్సెలింగ్ సెంటర్‌లోనూ పోస్టుల భర్తీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దు. దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు’ అని తెలిపారు.